తప్పించుకోవడానికేనా వంగి వంగి దండాలు.. కేటీఆర్ పై టీ.కాంగ్రెస్ విమర్శలు

by Ramesh Goud |   ( Updated:2025-02-07 12:33:57.0  )
తప్పించుకోవడానికేనా వంగి వంగి దండాలు.. కేటీఆర్ పై టీ.కాంగ్రెస్ విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ఢిల్లీ టూర్ (Delhi Tour)పై తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంచలన విమర్శలు చేసింది. ఈ మేరకు ట్విట్టర్ (Twitter) వేదికగా విమర్శలు చేస్తూ పోస్ట్ పెట్టింది. దీనిపై ఈ రేస్ కేసు (E Race Case) నుంచి తప్పించుకోవడానికేనా ఢిల్లీ (Delhi)లో వంగి వంగి దండాలు టిల్లూ..? అని ఎద్దేవా చేసింది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు.. నీ కుతంత్రం వాళ్లకు తెలిసినట్టుందని, అందుకే కేంద్రమంత్రులు అమిత్ షా (Union Minister Amit Shah), జేపీ నడ్డా (JP Nadda) అపాయింట్‌మెంట్ (Appointment) కూడా ఇవ్వలేదంట కదా అని దుయ్యబట్టింది.

అంతేగాక ఢిల్లీ వెళ్లి ఎవరినీ కలవకపోతే ఇజ్జత్ పోతుందనేగా నీ నాటకాలు అని, యూజీసీ (UGC) అంటున్నవ్, రోడ్లంటున్నవ్, బ్రిడ్జి అంటున్నవ్ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏందయ్యా కేటీఆర్.. ఢిల్లీలోనా నీ పగటివేశాలు..? అని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కేటీఆర్ ఢిల్లీ టూర్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా గురువారం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్.. కేంద్ర మంత్రులతో (Union Ministers) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం (Telangana State)లోని పలు అభివృద్ది పనులకు సంబంధించిన ప్రతిపాధనలు చేశారు.

తన ప్రతిపాధనలు పరిగణలోకి తీసుకొని, వెంటనే వాటి అమలు దిశగా కృషి చేయాలని విన్నవించారు. అలాగే యూజీసీ నిబంధనల మార్పు గురించి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు. యూజీసీ నిబంధనలలో తమకు అభ్యంతరాలు ఉన్నాయని, సెర్చ్ కమిటీల బాధ్యతలు రాష్ట్ర గవర్నర్ కి ఇవ్వడం సరికాదని అన్నారు. అలాగే ఫ్యాకల్టీ ఎంపికలో సీనియారిటీ ప్రకారం కాకుండా సబ్జెక్టుపై అవగాహన ఉన్నవారికి అవకాశం కల్పించాలని సూచించారు. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన విషయాన్ని మీడియా ముఖంగా గుర్తుచేస్తూ.. ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదన్నారు. అలాగే తెలంగాణలో ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Next Story