తలసాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.. బీర్ల ఐలయ్య ఫైర్

by Ajay Maddhiboyina |

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలనను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఖండించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు.

తలసాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.. బీర్ల ఐలయ్య ఫైర్
X

దిశ‌, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలనను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఖండించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. నోరు ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నాలుగు ముక్కలైందని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన విషయం తలసాని శ్రీనివాస్ యాదవ్ మర్చిపోయాడా అని ప్రశ్నించారు.

పరిపాలనా సౌలభ్యం కోసమే జీహెచ్ఎంసీని ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తలసాని ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల తలసాని మాట్లాడుతూ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజ్యాంగానికి లోబడి పనులు చేయాలన్నారు. ఇష్టం వచ్చినట్టు సికింద్రాబాద్ ప్రాంతాన్ని ముక్కలు చేస్తానంటే నిన్ను ముక్కలు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story