సీఎంను చర్చకు రమ్మనే దమ్ము, ధైర్యం నీకు లేవు..కేటీఆర్‌పై బీర్ల ఐలయ్య ఫైర్

by Ajay Maddhiboyina |

మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐల‌య్య విమ‌ర్శ‌లు గుప్పించారు. కేటీఆర్ త‌న స్థాయి మ‌రిచి మాట్లాడుతున్నాడ‌ని అన్నారు. డ్రామారావు కొత్త డ్రామాల‌కు తెర‌లేపుతున్నాడ‌ని వ్యాఖ్యానించారు.

సీఎంను చర్చకు రమ్మనే దమ్ము, ధైర్యం నీకు లేవు..కేటీఆర్‌పై బీర్ల ఐలయ్య ఫైర్
X

దిశ‌, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐల‌య్య విమ‌ర్శ‌లు గుప్పించారు. కేటీఆర్ త‌న స్థాయి మ‌రిచి మాట్లాడుతున్నాడ‌ని అన్నారు. డ్రామారావు కొత్త డ్రామాల‌కు తెర‌లేపుతున్నాడ‌ని వ్యాఖ్యానించారు. బ‌న‌క‌చ‌ర్ల‌పై చ‌ర్చ‌కు అసెంబ్లీకి రావాల‌ని కేసీఆర్‌కు సీఎం సవాల్ విసిరారని అన్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిని చర్చకు రమ్మనే దమ్ము, ధైర్యం నీకు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ నాన, మీ బావ అప్పనంగా ఆంధ్రకు నీళ్లు అప్పగించారని మండిపడ్డారు.

కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితమైతే కేటీఆర్ ప్రెస్ క్లబ్‌లో చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసిందని కేటీఆర్ అడుగుతున్నాడు...2009లో వైఎస్ఆర్ రైతులకు రుణమాఫీ చేశారని అన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్ కూలిపోయిన కాళేశ్వరం కడితే దానికి ఎస్ఆర్ఎస్పీ నుండే కాంగ్రెస్ నీళ్లు అందించిందని వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, నెట్టెంపాడు, దేవాదుల లాంటి అనేక ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసిందన్నారు.

Next Story