ఆ ఇద్దరి వల్లే కరీంనగర్ అవినీతిమయమైంది.. బండికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-09 05:46:31  IST  )

ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరుతో కరీంనగర్ అవినీతిమయమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

ఆ ఇద్దరి వల్లే కరీంనగర్ అవినీతిమయమైంది.. బండికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరుతో కరీంనగర్ అవినీతిమయమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. ఇవాళ కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఎంఐఎంతో కాంగ్రెస్ రూ.100 కోట్ల డీల్ చేసుకుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

అసలు కార్పొరేషన్‌లో బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) ఒప్పందం కుదుర్చుకున్నాయని పొన్నం ఆరోపించారు. ఆ రెండు పార్టీల పరస్పర అవగాహనతోనే అభ్యర్థుల ఎంపిక కూడా జరిగిందని అన్నారు. ఇక జిల్లా పరిధిలోని కొండగట్టు, వేములవాడ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని.. పదేళ్లలో కరీంనగర్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ తీరుతో జిల్లా అవినీతిమయంగా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

సిట్‌లు, తిట్లు ప్రజల కడుపు నింపవు రేవంత్.. మాజీ మంత్రి హరీశ్ రావు

Next Story