- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిట్‌లు, తిట్లు ప్రజల కడుపు నింపవు రేవంత్.. మాజీ మంత్రి హరీశ్ రావు
గత ప్రభుత్వంపై వరుసగా సిట్‌లు వేయడం, ఇష్టానుసారంగా తిట్టడం ప్రజల కడుపు నింపబోవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వంపై వరుసగా సిట్‌లు వేయడం, ఇష్టానుసారంగా తిట్టడం ప్రజల కడుపు నింపబోవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సిద్దిపేట్‌లో ఓ ప్రధాన మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలనలో స్కీములు నిల్.. స్కాములు ఫుల్ అంటూ సెటైర్లు వేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉన్నాయని, ఖచ్చితంగా మెజారిటీ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
నెలకో స్కామ్ క్యాలెండర్..
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఈసడించుకుంటున్నారని కామెంట్ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏం చేశామో చెప్పాలి.. చేయబోతున్న పనుల గురించి వివరించాలి అన్నారు. అంతేకానీ పొద్దున లేస్తే కేసీఆర్ (KCR)ను పట్టుకుని బూతులు మాట్లాడటం తప్ప మరేం లేదన్నారు. రూ.4 వేల పెన్షన్ లేదని, రెండు కిస్తీల రైతుబంధు ఎగ్గొట్టారని, ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. స్కీములకు కోత పెట్టారని.. అన్నీ స్కాములే చేస్తున్నాని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో అన్ని దేవుళ్లపై ఒట్టు పెట్టి దేవుడినే మోసం చేసిన ఘనుడు రేవంత్ అంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లేదు కానీ, నెలకో స్కామ్ క్యాలెండర్ మాత్రం బయటకు వస్తుందని ఎద్దేవా చేశారు. త్యాగాల చరిత్ర తమదని.. ద్రోహాల చరిత్ర నీది అంటూ హరీశ్ రావు, రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.






