- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందమైన బ్రోచర్లు.. ఆకర్షణీయ ఆఫర్లు.. బురిడీ కొట్టిస్తున్న సీయోరా ఇన్ఫ్రారియల్!
అందమైన బ్రోచర్ల ముద్రించి ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించి రియల్ వ్యాపారులు సామాన్యులకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు.

బొమ్మలరామారం మండలంలో సీయోర ఇన్ఫ్రా డెవలపర్స్ యాజమాన్యం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపణలు వచ్చాయి. అందమైన బ్రోచర్ల ముద్రించి ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించి సామాన్యులకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నట్లు తెలిసింది. ఏజెంట్లను నియమించుకొని కమీషన్లు చెల్లించి ప్లాట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్లాట్లు తొందరగా విక్రయం కావడం కోసం పండ్ల మొక్కలు పెంచి ఆదాయం సృష్టిస్తామని మోసపూరిత మాటలు చెబుతున్నారు. ఇప్పుడు సియోరా ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఉన్న వెంచర్లో మామిడి మొక్కలు పెంచారు కానీ వాటికి నీటి చుక్కను కూడా అందించే దిక్కు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కలు పండ్లు కాసేది ఎప్పుడు...ఆదాయం వచ్చేది ఎప్పుడు. గొర్రె కసాయివాడిని నమ్ముతుంది అన్న చందంగా కొనుగోలుదారులు కూడా ఏం ఆలోచించకుండా ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు.. ప్లాట్లు తిరిగి అమ్మేటప్పుడు, ఇళ్లు కట్టుకోవాలంటే అనుమతులు రానప్పుడు లబోదిబోమంటున్నారు.
దిశ, నల్లగొండ బ్యూరో : అందమైన బ్రోచర్ల ముద్రించి ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించి రియల్ వ్యాపారులు సామాన్యులకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. తమ దందా సాఫీగా జరిగేలా ఏజెంట్లను నియమించుకొని వారికి ఆకర్షణీయమైన కమీషన్లు అందజేస్తున్నారు. ఆఫర్లు, బహుమతులు ప్రకటించి కస్టమర్లు కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేస్తే ఎలాంటి అనుమతులు ఉండాలి భవిష్యత్తులో అమ్ముకోవాలంటే కొనుగోలు చేసిన సొమ్ము తిరిగి వస్తుందా లేదా అని ఆలోచన లేకుండా ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ ఇల్లు నిర్మించుకోవాలని చూస్తే అనుమతి లేదా బ్యాంకు రుణం వస్తుందా లేదా అనే విచారణ లేకుండానే మాయమాటలకు లొంగిపోయి రియల్ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు అలా కొనుగోలు చేసిన చాలామంది తర్వాత నష్టపోయామని గ్రహించి లబోదిబో మొత్తుకుంటున్నారు.
గజాల్లో ధర.. గుంటల్లో విక్రయాలు..
సీయోర ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ వ్యాపార సంస్థ కొంతమంది ప్రైవేటు వ్యక్తుల దగ్గర రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు ఎకరం చొప్పున సుమారు 150 ఎకరాల వరకు కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు ఆ భూమిలో వెంచర్ ఏర్పాటు చేసి 30 ఫీట్ల రోడ్లు, 200, 300 గజాల చొప్పున ప్లాట్లు చేశారు. అయితే ఒక ఎకరం భూమిలో రోడ్లు ఇతరత్రా భూమిని మినహాయించగా 2000 పైగా గజాల స్థలం ఉంటుంది. అందులో రూ. 6 వేలకు గజం చొప్పున అమ్ముకున్న రూ. 10 కోట్లకు పైగా ఆదాయం రియల్ వ్యాపారికి వస్తుంది. ప్లాట్లు తొందరగా విక్రయం కావడం కోసం పండ్ల మొక్కలు పెంచి ఆదాయం సృష్టిస్తామని మోసపూరిత మాటలు రియల్ వ్యాపారులు కస్టమర్లకు చెప్తున్నారు. కానీ ఇప్పుడు సియోరా ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఉన్న వెంచర్లో మామిడి మొక్కలు పెంచారు కానీ వాటికి నీటి చుక్కను కూడా అందించే దిక్కు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కలు పండ్లు కాసేది ఎప్పుడు.. ఆదాయం వచ్చేది ఎప్పుడు.. కేవలం కస్టమర్లను బురిడీ కొట్టించి మోసం చేస్తున్నారని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు గజాలలో ధర తీసుకొని గుంటలలో కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా వస్తుంది. ఇలా చేయడం ప్రభుత్వాన్ని మోసగించడమే. అని తెలిసి కూడా అధికారులు రియల్ వ్యాపారులు కుమ్మక్కై ప్రభుత్వ సొమ్మును మింగేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
తాల్లొని కుంట మాయం..??
మేడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోనే ప్రస్తుత ఫకీర్ గూడెం గ్రామపంచాయతీ ఉండేది. కానీ నూతన పంచాయతీలు ఏర్పడిన తర్వాత ఫకీర్ గూడెం ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ప్రస్తుతం సీయోరా ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్ మేడిపల్లి, ఫకీర్ గూడెం, మైలారం గ్రామ పంచాయతీలలో ఉంది. అయితే ఫకీర్ గూడెం గ్రామపంచాయతీ కింద ఉన్న వెంచర్లు సుమారు మూడున్నర ఎకరాల కుంట ఉండేది. అందులోకి వర్షాకాలంలో చేరిన నీరు భూగర్భ జలాలు పెరిగేందుకు బాగా ఉపయోగపడేది. అయితే రియల్ వ్యాపారులు ఆ కుంటను మూసి వేశారు. దీంతో భూగర్భ జలాలకు తీవ్ర నష్టం జరిగింది.
ఒక్క డాక్యుమెంట్‌కు రూ.20 వేలు!
రియల్ వ్యాపారులు ఫామ్ ల్యాండ్ ప్లాట్లు విక్రయించే క్రమంలో ఒక డాక్యుమెంట్ కోసం రూ.15 నుంచి రూ.20 వేలు బొమ్మలరామారం మండలం తహశీల్దార్ కార్యాలయంలో ముట్ట చెబుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆఫీస్ లో పనిచేసే సిబ్బంది కూడా వసూళ్లు చేస్తారనే విమర్శలు వచ్చాయి. ఆ తరహాలోనే యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యంగా బొమ్మలరామారం, యాదగిరిగుట్ట, బీబీనగర్, తుర్కపల్లి, ఆలేరు, డబ్బులు దండుకున్నారని అందరికీ తెలిసిందే. ఏసీబీ అధికారులకు కూడా పట్టుబడి సంఘటనలు ఉన్నాయి. ఒకవేళ అధికారుల చేతులకు ముడుపులు అందకపోతే నిబంధనకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫామ్ ల్యాండ్ వెంచర్లపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అనుమానాలు వస్తున్నాయి.






