- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొంథా తుపాన్.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
మహబూబాబాద్, ములుగు జిల్లా అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మొంథా తుపాను (Montha cyclone) కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందునా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క (Seethakka) ఆదేశించారు. ఇవాళ మొంథా తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ఆమె బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ఆదేశించారు. పలు చోట్ల రైళ్లు నిలిపివేసిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, ప్రయాణికులకు ఆహారం, తాగునీరు వంటి అవసరాలు తీర్చాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి:
ప్రజలు వాగులు, చెరువులు దాటే ప్రయత్నం చేయరాదని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సీతక్క కోరారు. తుపాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదన్నారు. చలిగాలులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. రైతులు, పశువుల కాపరులు తమ పశువులు, పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మత్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు.






