- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీలకు రాజ్యాధికారం రావాల్సిందే.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ (BC Bandh) తెలంగాణ వ్యాప్తంగా సంపూర్ణంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ (BC Bandh) తెలంగాణ వ్యాప్తంగా సంపూర్ణంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. ఇక హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమతమయ్యాయి. ఇవాళ ఉదయం ఎంజీబీఎస్ (MGBS) ఎదుట బీసీ సంఘాల నేతల ఆందోళన చేపట్టారు. రాజేంద్రనగర్, దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ, హయత్‌నగర్, బర్కత్‌పురా, ఇబ్రహీంపట్నం సహా ఆర్టీసీ డిపోల్లో బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి.
అదేవిధంగా జూబ్లీ బస్‌స్టేషన్ ఎదుట బీసీ సంఘాల నేతలతో కలిసి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు (Tamilnadu) తరహాలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లోనూ, మంత్రివర్గాల్లోనూ బీసీలకు వాటా కావాలన్నారు. రిజర్వేషన్లను పద్ధతి ప్రకారం చేయకుండా కేంద్రం సహకరించడం లేదంటే ఎలా అని ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీనే సీఎం అని కామెంట్ చేశారు. బీసీలకు రాజ్యాధికారం రావాల్సిందేనని కామెంట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడకుండా.. ఆచరణ సాధ్యమయ్యేలా రిజర్వేషన్లు పెంచాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
Read More..
కొనసాగుతోన్న బీసీ సంఘాల బంద్.. జిల్లాల్లో డిపోలకే పరిమితమైన బస్సులు






