బీసీల కలలు నెరవేరాయి : తెలంగాణ బీసీ కమిషన్​

by Naga Rani Yarlagadda |

తెలంగాణలో బీసీల కలలు నెరవేరే విధంగా 42 శాతం రిజర్వేషన్స్‌తో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విధంగా..

బీసీల కలలు నెరవేరాయి : తెలంగాణ బీసీ కమిషన్​
X
  • 42 శాతం రిజర్వేషన్లతో లోకల్​బాడీ ఎన్నికలు

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో బీసీల కలలు నెరవేరే విధంగా 42 శాతం రిజర్వేషన్స్‌తో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విధంగా నేటి నుంచి నామినేషన్స్‌ మొదలయ్యే విధంగా సానుకూల వాతావరణం ఏర్పడిందని, దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీసీ కమిషన్‌ తెలిపింది. ఈ మేరకు బుధవారం కమిషన్ ఛైర్మన్‌ జి. నిరంజన్‌, సభ్యులు రాపోలు జయప్రకాష్‌, తిరుమలగిరి సురేందర్‌, రంగు బాలలక్ష్మిలు​ప్రకటన విడుదల చేశారు. ఈ పరిణామాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ ప్రజలందరికీ వారు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కులాల సర్వే జరిగి 42శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం ద్వారా నిర్ణయమైనా, ఆ తర్వాత పరిణామాలతో ప్రజల్లో తీవ్రమైన ఉత్కంఠ ఏర్పడిందని, ఆ ఉత్కంఠకు తెర తొలగిందన్నారు.

Next Story