BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక పరిణామం.. బీసీ సంఘాల సామూహిక న్యాయపోరాటం

by Prasad Jukanti |   (  Updated:2025-10-01 11:46:31  IST  )

స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్ అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది.

BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక పరిణామం.. బీసీ సంఘాల సామూహిక న్యాయపోరాటం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్ అంశం (BC reservations) పొలిటికల్ హీట్ పెంచుతోంది. కోర్టులో ఉన్న రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ హైవోల్టేజ్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లపై కీలక పరిణామం చోటు చేసుకుంది. రిజర్వేషన్లపై బీసీ సంఘాలు సామూహిక న్యాయపోరాటం చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. ఈ నెల 8వ తేదీన బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసు విచారణల ఇంప్లీడ్ కావాలని బీసీ సంఘాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీరి న్యాయపోరాటానికి కాంగ్రెస్‍లోని బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు బాసటగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల చెల్లుబాటు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం రంజుగా నడుస్తున్న వేళ హైకోర్టు కోసు విచారణలో భాగస్వాములు అయ్యేందుకు బీసీ సంఘాలు ముందుకు వస్తున్నారనే ప్రచారం స్టేట్ పాలిటిక్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి.

అందరూ బయటకు రావాలి: వీహెచ్

బీసీలకు రిజర్వేషన్లు చారిత్రక అవసరం అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (V.Hanumantha Rao) అన్నారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కామారెడ్డి డిక్లరేషన్‍లో చెప్పినట్లుగా 42 శాతం బీసీలకు రిజర్వేషన్లను సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు. బీసీలకు కొంతమంది నాయకులు అడ్డుకుంటున్నారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు ప్రత్యేక కార్యాచరణతో వెళ్తున్నారని చెప్పారు. అసెంబ్లీలో బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు తెలిపి బయట ధర్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అక్టోబర్ 8న హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో బీసీలందరూ అందరూ కూడా బయటకు రావాలని పిలుపునిచ్చారు. గతంలో ఇచ్చిన 27 శాతం అమలు కాలేదు. 42 శాతం కోసం బీసీలు బయటకు రాకపోతే భవిష్యత్తులో ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రాదన్నారు. బీసీలు అంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీసీలకే ఎక్కువ ప్రాధాన్యత ఉందని ఈ అవకాశాన్ని బీసీలు సొంతం చేసుకోవాలన్నారు. స్థానిక ఎన్నికలు, విద్య, ఉద్యోగం అన్ని అంశాల్లో బీసీలుకు రిజర్వేషన్లు అమలు కావాలన్నారు. బీసీలు హక్కులు కోసం సాధన కోసం అంత ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు.

Next Story