BC Reservations: వీలైనంత త్వరగా సుప్రీంలో ప్రభుత్వం అప్పీల్: మహేశ్ కుమార్ గౌడ్

by Prasad Jukanti |   (  Updated:2025-10-13 09:16:11  IST  )

బీసీ రిజర్వేషన్ల విషయంలో మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

BC Reservations: వీలైనంత త్వరగా సుప్రీంలో ప్రభుత్వం అప్పీల్: మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్లపై (BC reservation) వీలైనంత త్వరగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చెప్పారు. కాంగ్రెస్ నేతలు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారన్నారు. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుకున్నామని బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు స్టే గురించి ఖర్గేకు వివరించామని సుప్రీంకోర్టుకు వెళ్తున్నామనే విషయం కూడా చెప్పామన్నారు. మంత్రుల మధ్య వివాదాలు చిన్న చిన్న అంశాలు అన్నారు. సమాచార లోపం వల్లే మంత్రుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని, ఈ వివాదాలు చర్చించి పరిష్కరించుకుంటామన్నారు.

Next Story