- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ రిజర్వేషన్లు ఓ సామాజిక విప్లవం.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దేశ చరిత్రలోనే ఓ సామాజిక విప్లవమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దేశ చరిత్రలోనే ఓ సామాజిక విప్లవమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఇవాళ జరిగిన పార్టీ జూమ్ మీటింగ్‌లో ఆయన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party), రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేశాయని తెలిపారు. ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలిపారు.
అదేవిధంగా నేడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైందని.. ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్ శ్రేణులు సీరియస్‌గా తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక దేశ వ్యాప్తంగా ‘ఓట్ చోరీ’ అంశంపై ఏఐసీసీ (AICC) ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. అక్టోబరు 15 నాటికి తెలంగాణ వ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టి ఏఐసీసీకి పంపాలన్నారు. ప్రతి గ్రామానికి 100 చొప్పున సంతకాల సేకరణ చేయాలన్నారు. డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సంతకాల సేకరణ పూర్తి చేయాలని మహేశ్ కుమార్ దిశానిర్దేశం చేశారు.






