- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: హీటెక్కుతున్న 'రిజర్వేషన్' పాలిటిక్స్.. బీఆర్ఎస్ బీసీ నేతలతో కేటీఆర్, హరీశ్‌రావు సమావేశం
బీఆర్ఎస్ బీసీ నేతలతో కేటీఆర్, హరీశ్‌రావు సమావేశం కాబోతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను గవర్నర్ వద్దకు పంపగా దీనిపై జిష్ణుదేవ్ వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. ఇటువంటి తరుణంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP), బీఆర్ఎస్ (BRS) మధ్య రిజర్వేషన్ల అంశంలో రాజకీయం ముదురుతోంది. రిజర్వేషన్ల విషయంలో అడ్డుతగలవద్దని ప్రతిపక్షాలకు అధికార కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం హస్తం పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూడు పార్టీల మధ్య డైలాగ్ వార్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈక్రమంలో తాజాగా ప్రతిపక్ష బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లపై తదుపరి కార్యాచరణ పై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం మరికాసేపట్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ బీసీ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు భేటీ కాబోతున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై చర్చించనున్నట్లు సమాచారం.
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్:
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చడం అసాధ్యం అని, 9వ షెడ్యూల్ తో ముడిపెటట్కుండా రాష్ట్ర సర్కారే ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రామచందర్ రావు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పొన్నం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామచందర్ రావు మరోసారి తన నిజస్వరూపం బయటపెట్టుకున్నారని దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబమని హెచ్చరించారు. అయితే బీసీ రిజర్వేషన్లలో ముస్లిం కోటా తీసేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైన వేళ ఇవాళ బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశం కావడంతో ఆ పార్టీ స్టాండ్ ఏంటి అనేది ఉత్కంఠ రేపుతోంది.






