- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో BC రిజర్వేషన్ల జీవో విడుదల
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సహా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో ఇక ఎన్నికల నగారా మోగడమే ఆలస్యమని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. తెలంగాణలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అనంతరం పరోక్షంగా 565 మండల పరిషత్‌లు, 31 జిల్లా పరిషత్‌లకు ఛైర్‌పర్సన్ల ఎన్నికలను నిర్వహిస్తామని పేర్కొంది. రిజర్వేషన్ల జీవో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.






