గాంధీ భవన్‌లో బీసీ రిజర్వేషన్ల సంబరాలు

by Ajay Maddhiboyina |

తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినందుకు హర్షం వ్యక్తం చేస్తూ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

గాంధీ భవన్‌లో బీసీ రిజర్వేషన్ల సంబరాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినందుకు హర్షం వ్యక్తం చేస్తూ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. టీపీసీసీ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని టీపీసీసీ నాయకులు స్వాగతించారు. ఈ సంబరాలకు టీపీసీసీ ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీష్ రావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా సంగిశెట్టి జగదీష్ రావు మాట్లాడుతూ, ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల కృషిని తెలంగాణ సమాజం గుర్తించాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రివర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ కేతురి వెంకటేష్, పులి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ ఆశయాలు నెరవేరుతున్నాయి: పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

రిజర్వేషన్ ల అమలుకోసం 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చర్యలను సమాజం సంపూర్ణంగా స్వాగతించాలని ఆయన ఆకాంక్షించారు.సమాజం ఈ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతించాలని ఆయన ఆకాంక్షించారు. సాంకేతిక, న్యాయ, రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకున్న ఈ చర్య పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతిపక్ష నాయకులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు వారి వాటా ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పించాలని మొదటి నుంచి ఆకాంక్షిస్తున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాలు తెలంగాణలో నెరవేరబోతున్నాయని, ఇది చాలా మంచి పరిణామమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలు అయ్యేలా తెలంగాణ నుండి అడుగులు పడతాయని, కాంగ్రెస్ పార్టీ దీని కోసం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Next Story