- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BC Reservation Bill : బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం.. స్వీట్లు తినిపించుకున్న కాంగ్రెస్ నేతలు
బీసీ రిజర్వేషన్ బిల్లు(BC Reservation Bill )కు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఆమోద ముద్ర వేసింది.

దిశ, వెబ్ డెస్క్ : బీసీ రిజర్వేషన్ బిల్లు(BC Reservation Bill )కు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఆమోద ముద్ర వేసింది. విద్యా, ఉద్యోగ నియామకాల్లో, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్(42% Reservations) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర పడటం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. బిల్లుకు ఆమోదముద్ర పడిన అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. కాంగ్రెస్ కు చెందిన బీసీ నేతలు అంతా మీడియా పాయింట్ వద్ద సమావేశం అయ్యి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి, సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ల పెంపుకు కృషి చేశారని అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నందుకు సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Adi Srinivas) పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) ప్రకారం.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆనాడు హామీ ఇచ్చారని, మేం బాధ్యతలు చేపట్టగానే 4 ఫిబ్రవరి 2024లో బీసీ కులగణన ప్రక్రియను మొదలు పెట్టామని అన్నారు. బీసీ రిజర్వేషన్లు 37 శాతానికి పెంచాలని గత ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదన పంపితే దాన్ని ఉపసంహరించుకుని 42 శాతం పెంచేందుకు కొత్త ప్రతిపాదన పంపిస్తున్నామని తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆది శ్రీనివాస్, వాకాటి శ్రీహరి, ఈర్నపల్లి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.






