CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి బీసీ నేతల కృతజ్ఞతలు

by Muthe.Rajitha |

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పించేందుకు జులై 10న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి బీసీ నేతల కృతజ్ఞతలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పించేందుకు జులై 10న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు చేసేందుకు పంచాయతీ రాజ్ చట్టం-2018కి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేబినెట్ ఆమోదించింది. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై నేడు బీసీ కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణా రావు, బీసీ నేతలు పాల్గొన్నారు.

ఆది శ్రీనివాస్ ఈ నిర్ణయాన్ని “కామారెడ్డి డిక్లరేషన్”ను నిలబెట్టిన చర్యగా అభివర్ణించి, సీఎం రేవంత్ రెడ్డికి బీసీల తరపున ధన్యవాదాలు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్.. కాంగ్రెస్ సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉందని, ఈ నిర్ణయం బీసీలకు రాజకీయ, ఆర్థిక శక్తిని పెంచుతుందని పేర్కొన్నారు.

Next Story