HYD: గాంధీజీ సమాధి వద్ద ఆ నాలుగు బిల్లులు..

by Gantepaka Srikanth |

ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.9పై స్టే విధిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

HYD: గాంధీజీ సమాధి వద్ద ఆ నాలుగు బిల్లులు..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.9పై స్టే విధిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే బీసీల స్థానాలు ఖరారు అయ్యినందున ఆశావాహుల ఆశలపై నీళ్ళు చల్లినట్లయింది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఈ విషయాలపై విచారించి నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల మధ్య బీసీలకు 42% రిజర్వేషన్లు సాకారం కావాలని కోరుతూ బాపు ఘాట్‌లోని గాంధీజీ సమాధి వద్ద ప్రార్థనలు చేయాలని బీసీ కమిషన్‌ సంకల్పించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ప్రార్థనలో పాల్గొన్న బీసీ నాయకులు మాట్లాడారు. బీసీలకు వారి హక్కు ప్రకారం విద్యా, ఉద్యోగ మరియు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌, సభ్యులు రాపోలు జయప్రకాష్‌, తిరుమలగిరి సురేందర్‌, బాలలక్ష్మి రంగ, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు బాపు ఘాట్‌ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

అనంతరం రాష్ట్ర శాసన సభ ఆమోదించిన 4 బిల్లులను గాంధీజీ సమాధి వద్ద ఉంచారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పలువురు కుల సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్వేత, చింతామణి, రాజ్‌గోపాల చారి, రవికాంత్‌లు పలు గాంధీజీ స్మృతి భజనలను ఆలపించారు.

Next Story