- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ మహాధర్నాకు రండి.. జస్టిస్ ఈశ్వరయ్యను కలిసిన బీసీ నాయకులు
ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 15న నిర్వహిస్తున్న బీసీ మహా ధర్నాకు రావాలని బీసీ నాయకులు జస్టిస్ ఈశ్వరయ్యను కోరారు. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఈశ్వరయ్యను ఆదివారం వారు కలిశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 15న నిర్వహిస్తున్న బీసీ మహా ధర్నాకు రావాలని బీసీ నాయకులు జస్టిస్ ఈశ్వరయ్యను కోరారు. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఈశ్వరయ్యను ఆదివారం వారు కలిశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఈ దేశంలో బీసీలకు చట్టబద్ధతలతోనే న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో గతంలో కూడా జీవో ఇష్యూ చేస్తే ఇదే హైకోర్టు కొట్టేసిందని తెలిపారు. సుప్రీంకోర్టులో కూడా తిరస్కరణకు గురైందన్నారు.
మహారాష్ట్రలోనూ అదే విధంగా జరిగిందని చెప్పారు. అనేక రాష్ట్రాల్లో జీవోల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినా చెల్లలేదని, రాష్ట్రంలో 42శాతం బీసీ రిజర్వేషన్‌ను తొమ్మిదవ షెడ్యూల్‌లో ఇంక్లూడ్ చేస్తే తప్ప బీసీలకు న్యాయం జరగదని తెలిపారు. ఆ పద్ధతులతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం సభ్యులు కుమార్‌గౌడ్, ప్రనీల్ చందర్, సుర్వి యాదయ్య, దేవి రవీందర్, సుప్ప ప్రకాశ్, వల్లూరు వీరేష్ తదితరులు పాల్గొన్నారు.






