మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ నేతల భేటీ

by Ajay Maddhiboyina |

తమిళనాడు తరహాలో ఇక్కడ కూడా రిజర్వేషన్లు అమలు అవుతాయన్న ఆశాభావాన్ని కాంగ్రెస్​ ​బీసీ నేతలు వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్​లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో కాంగ్రెస్​ బీసీ నేతలు సమావేశమయ్యారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ నేతల భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : తమిళనాడు తరహాలో ఇక్కడ కూడా రిజర్వేషన్లు అమలు అవుతాయన్న ఆశాభావాన్ని కాంగ్రెస్​ ​బీసీ నేతలు వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్​లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో కాంగ్రెస్​ బీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్​మహేష్​కుమార్​గౌడ్, మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, కార్పొరేషన్ చైర్మన్ అనిల్, సీనియర్ నేత వి. హన్మంతరావు తదితరులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాల పై చర్చించారు. న్యాయపరమైన అంశాల్లో రిజర్వేషన్ల పై ఎలా ముందుకు వెళ్ళాలో సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. తమిళనాడులో ఇటీవల కోర్టు తీర్పు గవర్నర్, రాష్ట్రపతి వద్ద ఉన్న పెండింగ్ బిల్లులు మూడు నెలలకు మించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకోవచ్చని ఉందనీ, కోర్టు తీర్పు నేపధ్యంలో తెలంగాణలో కూడా రిజర్వేషన్లు అమలు అవుతాయన్న ఆశాభావాన్ని నేతలు వ్యక్తం చేశారు.

Next Story