- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ జాగృతిలో బీసీ నాయకుల చేరిక
తెలంగాణ జాగృతిలో పలువురు బీసీ నాయకులు చేరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతిలో పలువురు బీసీ నాయకులు చేరారు. తెలంగాణ కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగే నరసింహ, గొరిగే రాధిక, మేడే సరిత, మేడే బాపురాజు, వీరమల్ల శారద, శివ పటేల్ సహా పెద్ద సంఖ్యలో బీసీలు జాగృతిలో చేరారు. వారికి కండువాలు కప్పి కవిత జాగృతిలోకి ఆహ్వానం పలికారు. అదేవిధంగా చెంగిచర్ల ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు సైతం జాగృతిలో చేరారు. కవిత పోరాటానికి మద్దతుగా ఉంటామని ప్రకటించారు. అటు తెలంగాణ జాగృతి యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్, మియాపూర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు యువకులు, తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్, మూసారాంబాగ్, మేడ్చల్‌కు చెందిన విద్యార్థులు కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు.
టీచర్స్ ఫెడరేషన్ కమిటీ
తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ కమిటీని కవిత ఆదివారం ప్రకటించారు. టీజేటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మోరం వీరభద్రరావు, జాడి శ్రీనివాస్ నియమితులయ్యారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ విద్యారంగ వికాసానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. వీరి నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. అధ్యక్షుడిగా మోరం వీరభద్రరావు, ఉపాధ్యక్షుడిగా బుర్ర రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్ నియామకం అయ్యారు.






