జీవో 46 రద్దు చేయాలని ట్యాంక్‌బండ్‌పై బీసీల ఆందోళన

by Malleboina Mahesh |   (  Updated:2025-11-26 09:11:28  IST  )

సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

జీవో 46 రద్దు చేయాలని ట్యాంక్‌బండ్‌పై బీసీల ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలను (Election of Sarpanch) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 46 ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంఘం నాయకులు (BC community leaders) ట్యాంక్‌బండ్‌ వద్దఆందోళన (Protest at Tank Bund) చేపట్టారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లలో లోపాల కారణంగా కొన్ని మండలాల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించిన బీసీ నాయకులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్‌బండ్‌ రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ ఆందోళన కారణంగా ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు, నిరసనకారులను అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించడంతో ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చింది.

ఇదిలా ఉండగానే మరో బృందం నేరుగా గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. జీవో నెంబర్ 46 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. గాంధీ భవన్ లోకి దూసుకెళ్లేందుకు బీసీ సంఘం నేతలు ప్రయత్నించారు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు, బీసీ నేతల మధ్య తోపులాట జరగ్గా.. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసు వాహనంలో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Next Story