- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BC Bill: రామచందర్ రావు వ్యాఖ్యల దుమారం.. బీజేపీకి బీసీ నేతల 48 గంటల డెడ్ లైన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు చేసి వ్యాఖ్యలు దుమారంగా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservation Bill) కల్పించేలా తెలంగాణ ఆసెంబ్లీ ఆమోదించిన బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చడం అసాధ్యం అంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ (Ramachandar Rao) రావు చేసిన వ్యాఖ్యలపై వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. రామచందర్ రావు వ్యాఖ్యలపై బీసీ నాయకులు భగ్గుమన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో బీజేపీ స్టేట్ చీఫ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ బిల్లు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చడం కుదరదని చెప్పడం సరికాదని రామచందర్ రావు 2 కోట్ల మంది బీసీలను అవమానించారని మండిపడ్డారు. రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలు బీజేపీ పార్టీ విధానమా లేక ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయమా అని ప్రశ్నించారు. బిసీ బిల్లుపై బీజేపీ పార్టీ తన వైఖరిని 48 గంటల్లో స్పష్టం చేయాలని డెడ్ లైన్ విధించారు. హైదరాబాద్ అశోక్ నగర్ లోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ నాయకులతో సమావేశమైన జాజుల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ.. ఢిల్లీలో వ్యతిరేకించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.






