BC JAC: బీసీ రిజర్వేషన్ల అంశంలో కీలక పరిణామం.. తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటు

by Prasad Jukanti |   (  Updated:2025-10-12 12:12:30  IST  )

ఈ నెల 14న తలపెట్టిన బీసీ సంఘాల బంద్ ను ఈ నెల 18కి వాయిదా వేశారు.

BC JAC: బీసీ రిజర్వేషన్ల అంశంలో కీలక పరిణామం.. తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 'తెలంగాణ బీసీ జేఏసీ' (BC JAC) ఏర్పాటు అయింది. బీసీ జేఏసీ చైర్మన్‍గా ఆర్.కృష్ణయ్య (R. Krishnayya), వైస్ చైర్మన్‍గా వీజీ నారగోనితో (V.G. Naragoni) పాటు ఆరుగురితో కమిటీ ఏర్పాటు చేశారు. ఇవాళ హైదరాబాద్‍లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ నెల 14న తలపెట్టిన బీసీ సంఘాల బంద్ ను ఈ నెల 18కి వాయిదా వేశారు.

బీసీ-జాక్

ఆర్.కృష్ణయ్య -చైర్మన్

వి.జి నారగోని- వైస్ చైర్మన్

జాజుల శ్రీనివాస్ గౌడ్- వర్కింగ్ చైర్మన్

రాజారాం యాదవ్- కో చైర్మన్

దాసు సురేశ్- కో చైర్మన్

గుజ్జ క్రిష్ణ-మీడియా కోఆర్డినేటర్

Next Story