ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు.. బీసీ గురుకుల స్టూడెంట్స్​

by Muthe.Rajitha |

మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లోని అడ్వెంచర్ క్యాంప్ నకు మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలకు చెందిన 20 విద్యార్థులు చేరుకున్నారు.

ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు.. బీసీ గురుకుల స్టూడెంట్స్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లోని అడ్వెంచర్ క్యాంప్ నకు మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలకు చెందిన 20 విద్యార్థులు చేరుకున్నారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సెలక్షన్స్ కోసం గురుకుల పాఠశాల నుండి 100 మంది బాలికలు 100 మంది బాలురులను ఎంపిక చేసి రెండు రోజుల పాటు భువనగిరిలోని రాక్ క్లైమ్బింగ్ శిక్షణ తీసుకున్నారు. అందులో నుండి 20 మందికి ఎంపిక చేశారు. మాలవత్ పూర్ణ, రాకేష్ ల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నారు. మే 25న హైదరాబాద్ నుంచి బయలుదేరిన పేద విద్యార్థులు మొదటి సారి ఫ్లైట్లో ప్రయాణం చేశారు. 26న నేపాల్ లోని ఎవరెస్ట్ మౌంట్​బేస్ క్యాంప్ నకు చేరుకున్నారు. ఈ అడ్వెంచర్​టూర్​లో 9 మంది బాలికలు, 11 మంది బాలురలో ఉన్నారు. 27వ తేదీ నుంచి ఎవరెస్ట్ మౌంట్​ఎక్కడం మొదలుపెట్టారు. సొసైటీ ఒక్కో విద్యార్థికి రూ.2.33 లక్షలు వెచ్చించించింది. ఈనెల 10వ తేదీన తిరిగి హైదరాబాద్​రానున్నారు.

Next Story