- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీ గురుకుల డిగ్రీ సీట్ల కేటాయింపు
బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో 2025–26 విద్యా సంవత్సరానికి అర్హత సాధించిన విద్యార్థుల జాబితా వెబ్ సైట్ లో అందుబాటులో ఉందని సోసైటీ కార్యదర్శి బడుగు సైదులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో 2025–26 విద్యా సంవత్సరానికి అర్హత సాధించిన విద్యార్థుల జాబితా వెబ్ సైట్ లో అందుబాటులో ఉందని సోసైటీ కార్యదర్శి బడుగు సైదులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ జాబితా అభ్యర్థుల మెరిట్, సీటు లభ్యత (సీటు మ్యాట్రిక్స్), వారు ఇచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా తయారు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు తమ సీటు కేటాయింపు స్థితిని అధికారిక వెబ్‌సైట్ tgrdccet.cgg.gov.in/TGRDCWEB/ or mjptbcwreis.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. సీటు కేటాయింపు పొందిన విద్యార్థులు 30.05.2025 నుండి 06.06.2025 లోగా తమకు కేటాయించిన కళాశాలకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు ఇచ్చి అడ్మిషన్ లో తీసుకోవాలని ఆయన తెలిపారు.
నిర్ణీత గడువు లోగా తమకు కేటాయించిన కాలేజీ లో రిపోర్ట్ చేయకపోతే సీటు రద్దు అవుతుందన్నారు. ఇది మొదటి జాబితా మాత్రమే అని, ఇంకా ఖాళీ సీట్లు ఉంటే మరిన్ని కేటాయింపులు చేస్తా మన్నారు. మొదటి జాబితా లో సీటు రాకపోయిన విద్యార్థులు తదుపరి జాబితాను వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు. మరింత సమాచారం కోసం 040-23328266 నంబర్‌కి కాల్, లేదా [email protected] కు మెయిల్ పంపించాలని ఆయన కోరారు.






