మంత్రి పొన్నం ప్రభాకర్​ను కలిసిన బీసీ ఎంప్లాయీస్​

by Muthe.Rajitha |

తెలంగాణ సెక్రటేరియట్ బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్​ను మర్యాద పూర్వకంగా కలిశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్​ను కలిసిన బీసీ ఎంప్లాయీస్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సెక్రటేరియట్ బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్​ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సచివాలయంలో ఇటీవల నిర్వహించబడిన క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ పదవుల ఎన్నికలలో బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులు గెలిచిన సంఖ్య గణనీయంగా ఉన్న విషయాన్ని వివరించారు. అలాగే, క్లాస్–4 ఉద్యోగుల సంఘం ఎన్నికలలో కూడా బీసీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారని తెలియజేశారు. ఇది సచివాలయంలో బీసీ ఉద్యోగుల ప్రాబల్యాన్ని ప్రతిబింభిస్తోందని, వారు అన్ని వర్గాలతో కలసికట్టుగా పనిచేస్తున్న దృక్పథాన్ని చాటుతోందని మంత్రివారితో పంచుకున్నారు.

అలాగే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను మంజూరు చేయడంపై సంఘం తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు తోడ్పడే గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి అసోసియేషన్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఉద్యోగుల సంక్షేమం కోసం సంఘం చేస్తున్న కృషిని ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత ఐక్యతతో, నిబద్ధతతో ముందుకు సాగాలని, ప్రభుత్వ విధానాల అమలులో భాగస్వామ్యం కావాలని సూచించారు. బీసీ అసోసియేషన్ అధ్యక్షులు టి.యాదగిరి, ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్, సచివాలయ ప్రధాన సంఘం కార్యదర్శి వి. కైలాసం, ఉపాధ్యక్షుడు ఎం. నవీన్ కుమార్ తో పాటు, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Next Story