బీజేపీ ఆఫీస్‍లో కొట్టుకున్న బీసీ సంఘాల నేతలు.. రామచందర్ రావు, ఆర్.కృష్ణయ్య సమక్షంలోనే బాహాబాహీ (వీడియో)

by Prasad Jukanti |   (  Updated:2025-10-20 13:22:33  IST  )

బీజేపీ స్టేట్ ఆఫీస్ లో బీసీ నేతల ఫైటింగ్ తీవ్ర కలకలం రేపింది.

బీజేపీ ఆఫీస్‍లో కొట్టుకున్న బీసీ సంఘాల నేతలు.. రామచందర్ రావు, ఆర్.కృష్ణయ్య సమక్షంలోనే బాహాబాహీ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ స్టేట్ ఆఫీస్‍లో బీసీ నేతల ఫైటింగ్ (BC leaders fight) తీవ్ర కలకలం రేపింది. ఇవాళ నాంపల్లి పార్టీ ఆఫీస్‍లో బీజేపీ (BJP state office) రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఎదుటే బీసీ సంఘాల నేతలు బాహాబాహీకి దిగారు. జూనియర్ సీనియర్ వివాదం తలెత్తడంతో నేతలు ఒకరిపై మరొకరు చేయిచేసుకున్నారు. ఈనెల 18న బీసీ జాక్ నిర్వహించ తలపెట్టిన బంద్‍కు మద్దతు ఇవ్వాలని బీజేపీని కోరేందుకు ఇవాళ ఆర్.కృష్ణయ్యతో పాటు బీసీ సంఘాల నేతలు బీజేపీ కార్యాలయానికి వచ్చారు. రామచందర్ రావుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టే సమయంలో జూనియర్ అయి ఉండి ఫోటోలకు ఎలా ముందుకు వెళ్తావ్ అని ఒకరినొకరు తిట్టుకుంటూ నేతలు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘర్షణకు దిగిన నేతలను మిగతా బీసీ నాయకులు అడ్డుకున్నారు. కొట్లాటకు దిగిన నేతలపై మిగతా బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Link
Next Story