- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంకెంత కాలం ఆర్. కృష్ణయ్య బీసీలను మోసం చేస్తారు.. బీసీ సంఘం నాయకురాలు సంచలన వ్యాఖ్యలు
బీసీలను మోసం చేస్తున్న ఆర్.కృష్ణయ్య వెంటనే రాజీనామా చేయాలని బీసీ సంఘం మహిళా నాయకురాలు మట్టా జయంతి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలను మోసం చేస్తున్న ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీసీ సంఘం మహిళా నాయకురాలు మట్టా జయంతి గౌడ్ (Matta Jayanthi Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (BC Reservations) సాధన కోసం ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో రేపు (Telangana Bandh) తెలంగాణ బంద్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం బీసీ సంఘం మహిళా నాయకురాలు మట్టా జయంతి గౌడ్ ఒక వీడియో విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై అన్ని బీసీ కుల సంఘాల నాయకులతో ఎంపీ ఆర్.కృష్ణయ్య ఒక కమిటీ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కానీ ఆయన రాజ్యసభకు రాజీనామా చేసి ఇదే కమిటీ వేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తన ఎంపీ పదవిని కాపాడుకుంటూ.. బీసీలపై ప్రేమ ఉన్నట్లు ఆర్ కృష్ణయ్య నటిస్తున్నారని ఆరోపించారు.
ఇంకెంత కాలం ఆర్.కృష్ణయ్య బీసీలను మోసం చేస్తారని తనకు అర్థం అవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని, కానీ ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల ఏ విధమైన సానుభూతి చూపించలేదని, వారికి న్యాయం చేయలేదని ఆరోపించారు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు మాత్రమే కోరుతున్నాం.. కానీ అది ఇవ్వట్లేదు కాబట్టి కొంత మంది నాయకులు జేఏసీగా ఏర్పాటు చేసి బీసీలకు తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించారు. రిజర్వేషన్ల కోసం బీసీ ప్రజాప్రతినిధులు అందరూ వారి వారి పదవులకు రాజీనామాలు చేసి పోరాటం చేయాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందని మట్టా జయంతి గౌడ్ సూచించారు.






