తెలంగాణ విద్యుత్ సంస్థల నియామకాలు.. రిజర్వేషన్లపై బీసీ కమిషన్ దృష్టి

by Ramesh Naini |

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల నియమాకాలలో రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ బీసీ కమిషన్ విచారణ జరుపుతోంది. దీనిలో భాగంగా సోమవారం కమిషన్ జెన్‌కో కార్యాలయాన్ని సందర్శించి విచారణ చేపట్టింది.

తెలంగాణ విద్యుత్ సంస్థల నియామకాలు.. రిజర్వేషన్లపై బీసీ కమిషన్ దృష్టి
X

టదిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల నియమాకాలలో రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ బీసీ కమిషన్ విచారణ జరుపుతోంది. దీనిలో భాగంగా సోమవారం కమిషన్ జెన్‌కో కార్యాలయాన్ని సందర్శించి విచారణ చేపట్టింది. ఓసీ కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చి రిజర్వేషన్ కేటగిరీలో నియమితులైన అభ్యర్థుల వివరాల గురించి కమిషన్ ఆరా తీసింది. కాగా, 2014 నుండి నేటి వరకు జరిగిన నియమాకాల్లో అవలంబిస్తున్న పద్ధతులు, బీసీలకు జరుగుతున్న అన్యాయాలను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీసీ కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను కమిషన్‌కు సమర్పించవలసిందిగా సంబంధిత ఉన్నతాధికారులను బీసీ కమిషన్ కోరింది. సమావేశంలో చర్చించిన వివిధ అంశాలపై నివేదికను సమర్పించాలని సీఎండీని చైర్మన్ కోరారు.

బీసీ ఉద్యోగులకు సంబంధించిన పలు ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే బీసీ కమిషన్, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో సంస్థల కార్యాలయాలను సందర్శించి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ మాట్లాడుతూ సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాల లక్ష్మి, కార్యదర్శి బీ. బాల మాయా దేవి, సంబంధిత ఉన్నతాధికారులు, తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె. కుమారస్వామి, వెంకన్న గౌడ్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Next Story