హుస్సేన్ సాగర్ ఘటనపై బీసీ కమీషన్ సీరియస్.. నివేదిక ఇవ్వాలని ఆదేశం

by Ramesh Goud |   (  Updated:2025-01-29 15:09:32  IST  )

హుస్సేన్ సాగర్ బోటు ప్రమాద(Hussain Sagar boat accident) ఘటనపై తెలంగాణ బీసీ కమిషన్ (Telangana BC Commission) సీరియస్ అయ్యింది.

హుస్సేన్ సాగర్ ఘటనపై బీసీ కమీషన్ సీరియస్.. నివేదిక ఇవ్వాలని ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: హుస్సేన్ సాగర్ బోటు ప్రమాద(Hussain Sagar boat accident) ఘటనపై తెలంగాణ బీసీ కమిషన్ (Telangana BC Commission) సీరియస్ అయ్యింది. ఘటనపై మూడురోజుల్లోగా నివేదిక (Report) ఇవ్వాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ (BC Commission Chairman Niranjan) హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand) కు లేఖ రాశారు. భరతమాతకు హరతి కార్యక్రమంలో (Bharat Mata Harathi program) భాగంగా హుస్సేస్ సాగర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా.. మరో యువకుడు గల్లంతయ్యాడు. క్షతగాత్రులలో ఒకరు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందగా.. మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన మరో యువకుడి మృతదేహాన్ని అధికారులు నిన్న సాయంత్రం వెలికితీశారు. దీనిపై బీసీ కమిషన్ హైదరాబాద్ సీపీ ని నివేదిక కోరుతూ లేఖ రాసింది. ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటలలోపు పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా గణతంత్ర దినోత్సవం రోజున నెక్లెస్ రోడ్డు (Necklace Road)లోని పీపుల్స్ ప్లాజా (People's Plaza) గ్రౌండ్స్ లో భారతమాత ఫౌండేషన్ (Bharat Mata Foundation) ఆధ్వర్యంలో భరతమాత మహా హారతి కార్యక్రమం (Bharat Mata Maha Aarti program) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు బోట్లు దగ్ధం (Two boats burnt) అయ్యాయి. ఇందులో ఎనిమిది మంది యువకులకు తీవ్ర గాయాలు అవ్వగా.. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గణపతి అనే వ్యక్తి మృతి చెందాడు. అలాగే ఇదే ప్రమాదంలో అజయ్ అనే యువకుడు గల్లంతయ్యాడు.

గల్లంతైన యువకుడి మృతదేహాన్ని డీఆర్ఎఫ్ (DRF), ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఫైర్ బృందాలు (fire teams) 48 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వెలికితీశాయి. ఈ ప్రమాదానికి గురైనా బాధితుల కుటుంబాలు కార్యక్రమం నిర్వహించిన భారతమాత ఫౌండేషన్ సభ్యులపై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy)పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ కుటుంబాల పిల్లలు అన్యాయం అయ్యారని, ఘనటపై భారతమాత ఫౌండేషన్ సభ్యులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించి తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటనపై బీసీ కమిషన్ స్పందించి ప్రమాదంపై నివేదిక కోరింది.

Next Story