- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ నియామకాల్లో రిజర్వేషన్ల ఉల్లంఘన! బీసీ కమిషన్ విచారణ
ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ నియామకాల్లో రిజర్వేషన్ల ఉల్లంఘన జరుగుతోందని విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం ఆరోపణలు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని ప్రభుత్వ విద్యుత్ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ సంస్థల నియామకాల్లో రిజర్వేషన్ల ఉల్లంఘన జరుగుతోందని తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంపై సంఘం స్టేట్ బీసీ కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది. దీంతో మార్చి 4వ వారంలో విద్యుత్ సంస్థల కార్యాలయాలను సందర్శించి ఈ విషయంపై విచారణ నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలంగాణ బీసీ కమిషన్ స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రంలోని విద్యార్థుల వివరాల సేకరణ వేగవంతం చేయాలని బీసీ కమిషన్ అధికారులకు సూచించింది.
శనివారం తెలంగాణ బీసీ కమిషన్ సమావేశం కమిషన్ కార్యాలయంలో చైర్మన్ జి. నిరంజన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కమిషన్ వివిధ అంశాలపై చర్చించిందని, ప్రధానంగా విద్యుత్ సంస్థలపై కమిషన్ సుదీర్ఘంగా చర్చించిందని బీసీ కమిషన్ తెలిపింది. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి, కమిషన్ మెంబర్ సెక్రటరీ బాల మాయా దేవి, డిప్యూటీ డైరెక్టర్ యు. శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి కె. మనోహర్ రావు, సెక్షన్ ఆఫీసర్ జి. సతీష్ కుమార్ లు పాల్గొన్నారు.






