రిజర్వేషన్ల కోసం.. బాపూఘాట్‌లో BC కమిషన్ ప్రార్థనలు

by Gantepaka Srikanth |

లంగాణ రాష్ట్రంలోని బీసీలకు లోకల్​బాడీ ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ల సాకారం కావాలని కోరుతూ హైదరాబాద్‌లోని బాపు ఘాట్‌లో ప్రార్థనలు చేయాలని కమిషన్ నిర్ణయించింది.

రిజర్వేషన్ల కోసం.. బాపూఘాట్‌లో BC కమిషన్ ప్రార్థనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు లోకల్​బాడీ ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ల సాకారం కావాలని కోరుతూ హైదరాబాద్‌లోని బాపు ఘాట్‌లో ప్రార్థనలు చేయాలని కమిషన్ నిర్ణయించింది. నవంబర్ 1వ తేదీన ఉదయం 10 గం.ల నుంచి 12 గం.ల వరకు ప్రార్థనలు చేస్తామని శనివారం ఓ ప్రకటనలో కమిషన్ తెలిపింది. కమిషన్ ఛైర్మన్ జి.నిరంజన్ మరియు సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా సంబంధిత శాఖలను కోరినట్లుగా వివరించారు. బాపు ఘాట్ లో బాపూజీ చితాభస్మం భద్రపరిచిన సమాధి దగ్గర జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రార్థనలతో పాటు బాపూజీ భజనలు ఆలపించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.

Next Story