ఆమెకు విశ్రాంతి అవసరం.. డీజీపీకి బీసీ కమిషన్ లేఖ

by Gantepaka Srikanth |

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ఈనెల 18న జరిగిన సంఘటనలో బాధితులైన కుటుంబానికి భద్రతా ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ శనివారం తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డికి లేఖ రాశారు.

ఆమెకు విశ్రాంతి అవసరం.. డీజీపీకి బీసీ కమిషన్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ఈనెల 18న జరిగిన సంఘటనలో బాధితులైన కుటుంబానికి భద్రతా ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ శనివారం తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డికి లేఖ రాశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చనిపోయిన రెండు నెలల పాప తల్లి మౌనిక బాలింత అని, ఆమెకు విశ్రాంతి అవసరమని చెప్పారు. ఆమెకు మెడికల్ చెకప్‌కు అవసరమైన వైద్య సదుపాయాలు కుటుంబానికి చేయాలని కోరామని నిరంజన్ తెలిపారు. ఆ పాప సమాధికి ఎటువంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ సంఘాల విజ్ఞప్తుల మేరకు తమ కమిషన్ ఈనెల 24వ తేదీన కుమ్మెర గ్రామంలో జాతర జరిగిన ప్రాంతానికి వెళ్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ సమక్షంలో సంఘటన వివరాలు సేకరించామని ఆయన తెలిపారు. ఆ సంఘటన తర్వాత ఘటనలను కమిషన్ నిశితంగా పరిశీలిస్తున్నదని నిరంజన్ చెప్పారు.

Next Story