- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Caste Census : కులగణన నివేదికను చించేసిన బీసీ కులసంఘాలు
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదిక(Caste Census) తప్పులతడక(Mistakes)గా ఉందంటూ బీసీ కులసంఘాలు(BC Caste Groups) సర్వే నివేదికను చించి(Tear) చెత్త బుట్టలో వేసి నిరసన(Protest) వ్యక్తం చేశాయి.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదిక(Caste Census) తప్పులతడక(Mistakes)గా ఉందంటూ బీసీ కులసంఘాలు(BC Caste Groups) సర్వే నివేదికను చించి(Tear) చెత్త బుట్టలో వేసి నిరసన(Protest) వ్యక్తం చేశాయి. బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ లో బీసీ సంక్షేమ సంఘం నిర్వహించిన బీసీ కుల సంఘాల సమావేశానికి హాజరైన నాయకులు రాష్ట్ర ప్రభుత్వం కులగణన నివేదికను బోగస్ అని..అగ్రకుల ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వే మా బీసీలకు వద్ధంటూ నినాదాలు చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, గౌరీ శంకర్ సహా పలు పార్టీలు, బీసీ కుల సంఘాల నాయకులు హాజరయ్యారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన సర్వే నివేదికను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తగలబెట్టమని..ఇదొక తప్పుల తడక అని చెప్పడం కులగణన సర్వే నివేదికను మరింత వివాదస్పదం చేసింది. అటు మంగళవారం శాసన సభలో, శాసన మండలిలో కులగణన సర్వే నివేదికపైన, బీసీ రిజర్వేషన్ల అంశంపైన అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదాలు కొనసాగుతున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే సభలో పెట్టలేదని సీఎం సహా కాంగ్రెస్ సభ్యులు ఆరోపించగా...తాము వెబ్ సైట్ లో పెట్టామని..ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన నివేదికను సభలో పెట్టలేదని కేటీఆర్ విమర్శించారు. ఎంఐఎం పక్ష నేత అక్బరుద్ధిన్ మాట్లాడుతూ ప్రభుత్వం కులగణనపై ప్రకటనకు పరిమితం కాకుండా సభలో నివేదిక పెట్టాలని డిమాండ్ చేశారు. సర్వే వివరాలలో ప్రైవసీ అంశాలున్నాయని..లీగల్ గా సమస్యలు వస్తాయని అందుకే సభలో పెట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మా సర్వేలో బీసీలు, ముస్లీంలు జనాభా అధికంగా ఉన్నట్లు తేలిందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధ్యపడకపోతే పార్టీ పరంగా 42శాతం టికెట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.






