- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీ సంఘాలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను నిలదీయాలి: చనగాని దయాకర్
by Malleboina Mahesh |
బీసీ సంఘాలు కేటీఆర్ ట్రాప్‌లో పడొద్దని, ఆయన శవాల దగ్గర పేలాల కోసం ఎదురుచూస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ మండిపడ్డారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : బీసీ సంఘాలు కేటీఆర్ ట్రాప్‌లో పడొద్దని, ఆయన శవాల దగ్గర పేలాల కోసం ఎదురుచూస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ మండిపడ్డారు. బీసీ సంఘాలు బీజేపీ, బీఆర్ పార్టీలను నిలదీయాలని ఆయన సూచించారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ చివరి వరకు పోరాడిందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీల ద్రోహులని ఆయన విమర్శించారు. శనివారం దయాకర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సామాజిక న్యాయం ఎజెండాగా పని చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు అవకాశాలు కోసం ఆలోచన చేశారన్నారు. బీసీ సంఘాల న్యాయ బద్దమైన పోరాటాలను తమ పార్టీ గౌరవిస్తుందని, బీసీ సంఘాలు బంద్‌కు పిలుపు ఇస్తే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ముందు వరుసలో ఉన్నారని దయాకర్ తెలిపారు. ఆ బంద్‌లో కేటిఆర్ ఎక్కడున్నారని, బీజేపీ నేతలు ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు.
Next Story






