- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతుకమ్మకుంటకు హనుమంతరావు పేరు.. బర్కత్ పురలో వాజ్‌పేయి విగ్రహం: స్టాండింగ్ కమిటీలో కీలక చర్చలు
నగరంలో అంతరించిపోయిన బతుకమ్మకుంటను హైడ్రా పునరుద్ధరించిన విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో అంతరించిపోయిన బతుకమ్మకుంటను హైడ్రా పునరుద్ధరించిన విషయం తెలిసిందే. అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు పేరు పెట్టాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఆమోదం కోసం జీహెచ్ఎంసీ కౌన్సిల్ కు సిఫార్సు చేసింది. దీంతోపాటు బర్కత్ పుర జంక్షన్ లో మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని సైతం చర్చించి కౌన్సిల్ అనుమతి కోసం సిఫార్సు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూర్తి అయిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.
స్థానిక కార్పొరేటర్ లు, ప్రజా ప్రతినిధులను ప్రారంభోత్సవ కార్యక్రమాలలో తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలన్నారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు. గురువారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన 11 వ సాధారణ స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో జరిగింది. ఈ కమిటీ సమావేశంలో 44 ఎజెండా అంశాల గురించి చర్చించారు. దీంతో పాటు 8 టేబుల్ అంశాలను ప్రవేశ పెట్టగా వీటిలో 6 అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సీఆర్ఎంపీ రెండో దశ పనులకు పరిపాలన అనుమతి మంజూరు ఇచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైరమల్ గూడ ఫ్లైఓవర్ సమీప రోడ్డుకు వంగా మధుసూదన్ రెడ్డి పేరు పెట్టడానికి అనుమతి కోరుతూ కౌన్సిల్ ఆమోదానికి సిఫార్సు చేసింది.






