- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: బతుకమ్మ పాట ప్రోమో విడుదల.. అదిరిపోయిన గోరటి వెంకన్న సాహిత్యం
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ‘మన బతుకమ్మ 2025’(Bathukamma Song) పాట ప్రోమో విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ‘మన బతుకమ్మ 2025’(Bathukamma Song) పాట ప్రోమో విడుదలైంది. ప్రోమోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. పూర్తి పాటను బుధవారం సాయంత్రం 8 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ ప్రజాకవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న(Goreti Venkanna) అద్భుతమైన సాహిత్యం అందించగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. అదితి భవరాజు, మంగ్లీ(Singer Mangli), గోరటి వెంకన్న ఆలపించగా.. ఈశ్వర్ పెంటి (ప్రేమలో ఫేమ్) నృత్య రూపకల్పన చేశారు. దర్శకుడు బద్రప్ప గాజుల ప్రతి సన్నివేశాన్ని సజీవ చిత్రంగా మలచగా, శ్యామ్ దుపాటి, ఉదయ్ గుర్రాల (సినిమాటోగ్రఫీ) తెలంగాణ పల్లె దృశ్యాలు, పండుగ వాతావరణం, ఉత్సాహం అన్నింటినీ అద్దం పట్టినట్లుగా అద్భుతంగా తెరకెక్కించారు. ఓ తంగేడు పూల తల్లి బతుకమ్మ అంటూ సాగే ఈ పాటను తెలంగాణ ఆడపడుచులు ఆడిపాడుకునేలా రూపొందించారు. 49 సెకన్ల నిడివి గల ఈ ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.






