సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట

by Disha Web Desk 4 |
సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ సంస్కృతి దేశ వ్యాప్తంగా వ్యాపిస్తుంది. బలగం వంటి చిత్రాలతో ఇప్పటికే తెలంగాణ యాస, భాషా, కట్టుబాట్లను కళ్లకు కట్టినట్లు చూపిస్తుండగా.. తాజాగా తెలంగాణ సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ పాన్ ఇండియా లెవల్‌లో వ్యాపించబోతుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ సినిమాలో బతుకమ్మపై స్పెషల్ గ్రాండ్‌ షూట్ చేశారు.

ఈ పాటకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. పాటలో హీరో వెంకటేష్, పూజహెగ్డే, భూమిక, పలువురు సీనియర్ నటీనటులు కూడా ఉన్నారు. అయితే, సల్మాన్ ఖాన్ ట్వీట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ.. ఇప్పుడు తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్‌ను సంపాదించుకుందని హర్షం వ్యక్తం చేశారు.

కాగా, ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజాగా ఈ పాటని విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా, వెంకటేష్ పూజ హెగ్డేకు అన్నగా నటిస్తున్నారు. అయితే హిందీ సినిమాల్లో గతంలోనూ బతుకమ్మ పాటలు అలరించాయి. 1964 లో శతరంజ్ సినిమాలో, 1969లో రాజ్ కుమార్ సినిమాలో బతుకమ్మ పాటలు అలరించాయి.

ఇవి కూడా చదవండి: ఎన్టీఆర్ చిన్నప్పటి ఫొటో వైరల్..

Next Story

Most Viewed