- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bathukamma Kunta : బతుకమ్మ కుంట బతికింది..! : వీహెచ్
ఆక్రమణలు తొలగించి(Encroachments removed)న హైడ్రా(Hydra)చేపట్టిన అభివృద్ధి పనులతో బతుకమ్మ కుంట(Bathukamma Kunta)లో నీటి ఊట ఎగిసిపడిన(water fountain has burst) క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు(V. Hanumantha Rao)హర్షం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆక్రమణలు తొలగించి(Encroachments removed)న హైడ్రా(Hydra)చేపట్టిన అభివృద్ధి పనులతో బతుకమ్మ కుంట(Bathukamma Kunta)లో నీటి ఊట ఎగిసిపడిన(water fountain has burst) క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు(V. Hanumantha Rao)హర్షం వ్యక్తం చేశారు. బతుకమ్మ కుంటను పరిశీలించి చెరువు పునరుజ్జీవం పొందిన సందర్బంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ బతుకమ్మ కుంట బతికింది అని వ్యాఖ్యానించారు. హైడ్రా వల్లనే బతుకమ్మ కుంట చెరువు మళ్లీ జీవం పోసుకుందని అభినందించారు.
ఈ సందర్భంగా స్థానికులు చెరువు వద్ద బతుకమ్మ ఆడుతూ సంబరాలు చేసుకున్నారు. జై హైడ్రా అంటూ నినాదాలు చేశారు. మళ్ళీ బతుకమ్మ కుంట తమకు అందుబాటులోకి రావడం పట్ల వారు తమ హర్షాతీరేకాలు వ్యక్తం చేశారు. కబ్జాల చెరలో ఆనవాళ్లు కోల్పోయిన బతుకమ్మ కుంట చెరువుకు ప్రాణం పోయమని స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా సమగ్ర సర్వే నిర్వహించి ఈ ప్రాంతంలోని ముళ్ల పొదలను తొలగించి..పూడిక తీత పనులు చేపట్టారు. ఈ క్రమంలో జేసీబీలతో మోకాలు లోతు త్రవ్వగానే గంగమ్మ ఉప్పొంగి స్వాగతం పలికిందని స్థానికులు సంబర పడుతున్నారు. దశాబ్దాలుగా నింపిన మట్టిని మొత్తం తొలగిస్తే చెరువు కళకళలాడుతుందని స్థానికులు చెబుతున్నారు.
అయితే బతుకమ్మ కుంట స్థలం తనదంటూ స్థానిక నాయకుడు ఎడ్ల సుధాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. కింది కోర్టుకు వెళ్లాలని సూచించిన విషయం విధితమే. నాటి నుంచి పనులను హైడ్రా కొనసాగించింది. అంబర్‌పేట మండలం, బాగ్అంబర్‌పేట్‌లోని సర్వే నంబరు 563లో 1962 -63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉంది. బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణం అని సర్వే అధికారులు తేల్చారు. తాజా సర్వే ప్రకారం అక్కడ మిగిలిన భూమి కేవలం 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే. మిగిలి ఉన్న ఈ 5.15 ఎకరాల విస్తీర్ణంలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్న వారికి ఎలాంటి ముప్పు లేకుండా చెరువు తవ్వకానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలిచ్చారు. ఒకప్పటి ఎర్రకుంటనే.. కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందని స్థానికుల కథనం. రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. బతుకమ్మకుంటలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పోయడంతో చెరువు ఆనవాళ్లు కోల్పోయిందన్న స్థానికులు వెల్లడించారు. బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు హైడ్రా చేపట్టడంతో నీటితో బతుకమ్మ కుంట కళకళలాడితే పరిసర ప్రాంతల్లో పర్యావరణం, భూగర్భ జలాల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడనుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హైడ్రా ప్రస్తుతం అంబర్‌పేట బతుకమ్మ కుంట, పాతనగరం బుమ్రుఖ్ దవాలా, ఎన్ కన్వెన్షన్ వెనుక తమ్మిడి కుంట, గుట్టలబేగంపేట మాదాపూర్ సున్నం చెరువు, కూకట్ పల్లి నల్ల చెరువు, వరంగల్ హైవేపై ఉప్పల్ పెద్ద చెరువు పనుల పునరుద్ధరణ చేపట్టినట్లుగా హైడ్రా వెల్లడించింది.






