- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bathukamma celebrations: గాంధీభవన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
టీపీసీసీ NRI సెల్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్ ఘనంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమ బతుకమ్మ సంబరాలు జరిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గాంధీభవన్‌లో (Bathukamma celebrations) బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ NRI సెల్ ఆధ్వర్యంలో సోమవారం గల్ఫ్ కార్మికుల సంక్షేమ బతుకమ్మ సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) పాల్గొన్నారు. వారితో పాటు బతుకమ్మ సంబరాల్లో నగర మేయర్ విజయలక్ష్మి, సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నెల గద్దర్, గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు,ఎన్. ఆర్.ఐ చైర్మన్ వినోద్ కుమార్, సభ్యులు, చెన్నమనేని శ్రీనివాస్, కార్పొరేషన్ చైర్మన్లు కల్వ సుజాత, రైతు కమిషన్ మెంబర్ భవాని రెడ్డి, బొజ్జ సంధ్యా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం గాంధీభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం తాగిందని మండిపడ్డారు. GST తో పేదలకు లబ్ధి చేసినట్టు బీజేపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ టాక్స్ అని మొదటి నుంచి చెప్తున్నామని అన్నారు. పేదలను దోచుకోవడానికి జీఎస్టీ తెచ్చారని, శవ పేటికలపై, పసి పిల్లల తినుబండారాలపై కూడా జీఎస్టీ వేశారని, GST ట్యాక్స్ తో ఏదైనా మంచి పని చేశారా..? అని ప్రశ్నించారు. ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికే మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని కేంద్రం జీఎస్టీ తగ్గింపు పై స్పందించారు.






