- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు.. జనసంద్రమైన ట్యాంక్‌బండ్
హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ట్యాంక్ బండ్‌పై ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకగా బతుకమ్మ సంబరాలు మంగళవారంతో ముగిశాయి. వేలాది మహిళలు ట్యాంక్‌బండ్‌కు చేరుకుని బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు. తీరొక్క పూలతో మహిళలు వేడుకలు చేసుకున్నారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మలతో అమరుల స్థూపం దగ్గర తొలిపూజ చేశారు. అమరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు 700 బతుకమ్మలతో ఊరేగింపు నిర్వహించారు. ముఖ్యంగా 500 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డప్పుల సౌండ్‌లతో బతుకమ్మ ఆటపాటలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మారుమోగిపోయాయి. అంతేకాకుండా బతుకమ్మ లేజర్ లైట్ షో ఆకట్టుకుంది.
ఈ బతుకమ్మ వేడుకలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క, ఎంపీ అనిల్ యాదవ్, ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను బతుకమ్మ ఆడుతున్నానని. ఇవాళ్టి రోజు చరిత్రలో నిలిచిపోయే బతుకమ్మ అని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రజాప్రభుత్వంలో ఏర్పాటు చేసుకున్న బతుకమ్మ అన్నారు. గిన్నిస్ బుక్‌లో మన బతుకమ్మను ఎక్కించాలనే తపనతో మన బతుకమ్మను ప్రపంచవ్యాప్తం చేశామన్నారు. ఇందుకోసం పాటుపడిన ప్రతి ఒక్కరికీ పత్యేక అభినందనలు తెలిపారు. పువ్వులను పూజించే గొప్ప సంస్కతి మనదని, ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదని, తొమ్మిది రోజులు ఎంతో సంతోషంగా మహిళలు ఈ పండుగను జరుపుకున్నారని తెలిపారు. ఇప్పటి యువత వెస్ట్రన్ కల్చర్‌లో బతుకమ్మ జరుపుకోవద్దని మన సాంప్రదాయాలకు అనుగుణంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.
సద్దుల బతుకమ్మ సంబురాల చిత్ర మాలిక..






