- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు
by Gantepaka Srikanth |
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు(Bathukamma Celebrations) ఘనంగా ప్రారంభం అయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana) వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు(Bathukamma Celebrations) ఘనంగా ప్రారంభం అయ్యాయి. మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలు చేసుకున్నారు. పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో సందడిగా వాతావరణం ఏర్పడింది. మరోవైపు బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాలు, అన్ని కాలేజీలు, మాల్స్‌లోనూ బతుకమ్మ సంబరాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేశారు. ముఖ్యంగా వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి వద్ద ఏర్పాటు చేసిన సంబురాలు అంబరాన్నంటాయి. వేయి స్తంభాల గుడి పరిసరాలు దద్దరల్లిపోయాయి.
Next Story






