- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేపాల్ లింకులతో సైబర్ మోసాలు.. దేశవ్యాప్తంగా కేసుల్లో నిందితుడైన బాషా సుల్తాన్ అరెస్ట్: శిఖా గోయల్
విదేశీ లింకులు కలిగిన సైబర్ మోసగాడు షేక్ బాషా సుల్తాన్‌ను అరెస్ట్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ డీజీ శిఖా గోయల్ శుక్రవారం ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన ఇంటర్ స్టేట్ ఆపరేషన్‌లో భాగంగా విదేశీ లింకులు కలిగిన సైబర్ మోసగాడు షేక్ బాషా సుల్తాన్‌ను అరెస్ట్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ డీజీ శిఖా గోయల్ (Shikha Goel) శుక్రవారం ప్రకటించారు. నిజామాబాద్ సీసీసీఎస్‌లో నమోదైన ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం కేసు ఆధారంగా దర్యాప్తు సాగించిన పోలీసులు, ఎపీలోని చిలకలూరిపేటలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వాట్సాప్ ద్వారా ‘అన్యా శర్మ’ పేరుతో పరిచయం చేసుకుని, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.7.75 లక్షలు మోసగించినట్లు విచారణలో బయటపడింది. అక్టోబర్ నెలలో ఐదు రాష్ట్రాల్లో అరెస్టైన 81 మంది నిందితులకు బాషా సుల్తాన్ సహకరించినట్లు కూడా విచారణలో తెలిసింది.
దేశవ్యాప్తంగా 26 సైబర్ క్రైమ్ కేసుల్లో, రాష్ట్రంలో మూడు కేసుల్లో ఈ నిందితుడికి సంబంధం ఉన్నట్లు వెల్లడించారు. నేపాల్‌కు చెందిన రామేశ్వర్, రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి మనీలాండరింగ్‌కు పాల్పడ్డట్లు గుర్తించారు. వారిపై లుక్ అవుట్ సర్క్యులర్లు జారీ చేసినట్లు డీజీ వెల్లడించారు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బృందం సైబర్ మోసాలను అణచివేయడానికి కొనసాగిస్తున్న చర్యల్లో ఈ అరెస్ట్ కీలకంగా మారింది.






