- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
బాసర ట్రిపుల్ ఐటీ సిబ్బంది నిర్వాకం.. విద్యార్థులు షాక్
దిశ,వెబ్‌డెస్క్: బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంది. సెలవులు ముగించుకొని తిరిగి క్యాంపస్‌కు వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తమ పుస్తకాలు, సామాన్లను బాసర త్రిపుల్ ఐటీ సిబ్బంది బయటపడేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. సిబ్బంది నిర్వాకంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా సామాన్లు, పుస్తకాలు బయటపడేయటమేంటని నిలదీస్తున్నారు. ఇలా పనికిరాని వస్తువుల్లా చెల్లా చెదురుగా పుస్తకాలు పడేయటంపై విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.
ఈనెల 7నుంచి సెకండ్ సెమ్ ఉండటంతో విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి చేరుకుంటున్నారు. విద్యార్థులు హాస్టల్ కు వెళ్లే సరికి వారి వస్తువులు , బుక్స్ లేకపోవడంతో వెతకగా ఓ చోట పడేసి కనిపించాయి. కొద్ది రోజుల్లో సెకండ్ సెమ్ ఉండగా బుక్స్ లేకపోవడంతో ఎలా ప్రిపేర్ కావాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.