Local Body MLC elections: ఎమ్మెల్సీ ఎన్నిక వేళ హైదరాబాద్‌లో హిందువుల పేరుతో బ్యానర్ల కలకలం

by Ramesh Naini |   (  Updated:2025-04-21 15:27:00  IST  )

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నగరంలో బ్యానర్ల కలకలం రేపుతోంది.

Local Body MLC elections: ఎమ్మెల్సీ ఎన్నిక వేళ హైదరాబాద్‌లో హిందువుల పేరుతో బ్యానర్ల కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (Hyderabad Local Body MLC Elections) ఎన్నికల వేళ నగరంలో బ్యానర్ల (Banners) కలకలం రేపుతోంది. ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సోమవారం నగరంలోని పలు చోట్ల హిందువుల (Hindus) పేరుతో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. హిందువులను కించపరిచే ఎంఐఎం పార్టీకి తొత్తులుగా వ్యవహరించవద్దని బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లకు సూచించారు. ఎంఐఎం అడుగులకు మడుగులొత్తే అధిష్టానం ముఖ్యమా, ఓట్లు వేసి గెలిపించిన హిందువులు ముఖ్యమా అని నిలదీశారు. మేలుకోండి బీఆర్ఎస్ - కాంగ్రెస్ కార్పొరేటర్లారా! హిందువులకు అండగా నిలవాలంటే ఎంఐఎంకు మద్దతు ఇవ్వకండి.. అంటూ హిందువుల పేరుతో బ్యానర్లు కట్టారు. కార్పోరేటర్‌కి విజ్ఞప్తి 15 నిమిషాలు సమయమిస్తే మమ్మల్ని చంపేస్తామన్న ఎంఐఎంకు ఓటు వేస్తే.. వచ్చే ఎన్నికల్లో మేం మీకు ఓటెయ్యం అని హిందువులు బ్యానర్లలో హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో మజ్లిస్‌కు సహకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఎవరికీ సపోర్ట్ చేయవద్దని కార్పోరేటర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం ఓట్లు 110 ఉన్నాయి. అందులో ఎంఐఎం పార్టీకి 49 ఓట్ల బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 14 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి 24 ఓట్లు ఉన్నాయి. బీజేపీకి 19 మంది కార్పొరేటర్లు 6 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 25 మంది ఉన్నారు. ఓట్ల ప్రకారం చూస్తే.. మజ్లిస్‌కు సపోర్టు ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో గెలవాలని బీజేపీ సీరియస్‌గా ప్రచారం చేస్తోంది.

Next Story