- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TCSBకి సవాలుగా బ్యాంక్ అకౌంట్స్ లీకేజీ వ్యవహారం.. దర్యాప్తులో మ్యూల్ అకౌంట్స్ బట్టబయలు
సైబర్ క్రైం నేరాల్లో మొదటగా ఉత్పన్నమయ్యే ప్రశ్న సమాచారం ఎవరు చేరవేశారు అని.

దిశ, తెలంగాణ బ్యూరో: సైబర్ క్రైం నేరాల్లో మొదటగా ఉత్పన్నమయ్యే ప్రశ్న సమాచారం ఎవరు చేరవేశారు అని. సమాచారాన్ని చేరవేసే డేటా లికర్స్ ఎవరనేది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ)కు సవాలుగా మారింది. ఒక్క టీజీసీఎస్బీ కాదు నేషనల్ సైబర్ బ్యూరో (ఎన్సీఆర్బీ) అధికారులకు కూడా పెద్ద సవాలుగా మారింది. సైబర్ సెక్యూరిటీలో అత్యధిక రిఫండ్ చేసిన అంశంలో దేశ వ్యాప్తంగా టీజీసీఎస్బీ ముందుంది. కానీ డేటా లీకర్స్ అరికట్టడంలో మాత్రం అనుకున్నంత పనితనాన్ని చూపించలేకపోతోంది. గుజరాజ్, రాజస్థాన్, యూపీ వంటి రాష్ట్రాల్లో నిఘా ఉంచి సైబర్ నేరాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసి రాష్ట్రానికి తీసుకువస్తున్నారు.. కానీ బాధితులను సైబర్ అటాక్ బారిన పడకుండా చూడటంలో మాత్రం వెనకంజలో ఉన్నారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో బ్యాంక్ ఖాతాదారుల వివరాలు
సైబర్ నేరగాళ్ల చేతిలో బ్యాంక్ ఖాతాదారుల వివరాలు ఉన్నట్లు వివిధ నిఘా సంస్థలు తెలుపుతున్నాయి. బ్యాంక్ సిబ్బందిలో ఉన్నవారే సైబర్ నేరగాళ్లకు సమాచారం అందిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైబర్ నేరాలకు గురైన ఖాతాదారులను పరిశీలిస్తే ప్రైవేటు బ్యాంక్ లకు చెందిన ఖాతాలను కలిగి ఉన్నవారే అన్న విషయం బయటపడుతోంది. ప్రభుత్వ అనుమతిలో ఉన్న నేషనలైజ్డ్ బ్యాంక్ లలో సైబర్ బాధితుల సంఖ్య తక్కువనే చెప్పాలి. ప్రైవేట్ బ్యాంక్ ల రిక్రూట్ మెంట్ విధానం అందుకు కారణంగా తెలుస్తోంది. అరకొర జీతాలతో అర్షత లేని వారికి ఉద్యోగాలు కల్పించడంతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు టీజీసీఎస్బీ దర్యాప్తులో వెల్లడవుతోంది. టీజీసీఎస్బీ చేధించిన కేసులలో బ్యాంక్ ఉద్యోగి ఉండటం గమనార్షం. సైబర్ నేరగాళ్లకు సహకరించే వారికి అకౌంట్స్ జారీ చేయడం అకౌంట్స్ ద్వారా దొంగిలించిన సొమ్మును విదేశాలకు చేర్చడం, వాటిని క్రిప్టో కరెన్సీలోకి మార్చడం వంటివి బ్యాంక్ సిబ్బంది చొరవతో మాత్రమే జరుగుతున్నట్లు టీజీసీఎస్బీ గుర్తించినట్లు తెలుస్తోంది.
గుజరాత్, రాజస్థాన్ , యూపీల్లో సైబర్ హాట్ స్పాట్స్
సైబర్ క్రైమ్ లో నమోదైన కేసులను దర్యాప్తు చేసిన సమయంలో టీజీసీఎస్బీకి పట్టుబడిన నిందితుల్లో అధిక శాతం గుజరాత్, రాజస్థాన్, యూపీ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. సైబర్ క్రైం హాట్ స్పాట్ కూడా ఎక్కువగా గుజరాజ్, రాజస్థాన్, యూపీలో ఉన్నట్లు గుర్తించారు. బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, పార్ట్ టైం జాబ్స్, డిజిటల్ అరెస్ట్, ఫేక్ కస్టమర్ కేర్, డెబిట్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్, ఫ్రీ ఆఫర్స్ , కేవైసీల పేరుతో సైబర్ క్రైంలకు పాల్పడుతున్నట్లు పలు కేసుల దర్యాప్తులో గుర్తించినట్లు టీజీసీఎస్బీ అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ ఉద్యోగులే టార్గెట్ గా చేసిన నేరాల్లో తెలంగాణ వ్యాప్తంగా 56శాతం మంది ఉన్నారు. 2024లో రూ.1869.9 కోట్లు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. వాటిలో సుమారు రూ.1050కోట్లు ప్రైవేట్ ఉద్యోగుల వద్ద నుంచి వచ్చినవే. తర్వాతి స్థానంలో 10శాతంతో రూ.186.9 కోట్లతో సెల్ఫ్ ఎంప్లాయీస్ బాధితులు ఉన్నారు. సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్న వారిలో డాక్టర్లు అధిక మొత్తంలో నష్టపోయిన వారిలో ఉన్నారు.
బాధితుల ప్రొఫెషన్ శాతం
ప్రైవేట్ ఎంప్లాయీస్ - 56
సెల్ఫ్ ఎంప్లాయీస్ - 10
బిజినెస్ పీపుల్స్ - 9
స్టూడెంట్స్ - 9
గవర్నమెంట్ ఎంప్లాయీస్ - 5
టార్గెట్ హైదరాబాద్..
సైబర్ నేరగాళ్ల ప్రధాన టార్గెట్ హైదరాబాద్ నగరంగా ఎంచుకున్నట్లు సైబర్ క్రైమ్ బ్యూరోలో నమోదైన కేసులు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో సుమారు 70వేల కేసులు ఒక్క హైదరాబాద్ నగరంలోనే నమోదైనట్లు గత నివేదికల్లో వెల్లడవుతోంది. నగరంలో ప్రైవేట్ బ్యాంక్ లు పెరిగిపోవడం, విచ్చలవిడిగా రిక్రూట్ మెంట్ చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఎకానమికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. మ్యూల్ అకౌంట్స్ నిర్వహించడంలో ప్రైవేట్ బ్యాంక్ ల ద్వారా విదేశాలకు డబ్బు తరలినట్లు ఎన్సీఆర్బీ గుర్తించింది.
హైదరాబాద్ నగరంలో 2024 జనవరి - 2025 మే వరకు నమోదైన సైబర్ క్రైమ్ కేసుల వివరాలు
కమిషనరేట్ నమోదైన కేసులు
సైబరాబాద్ కమిషనరేట్ - 27,132
హైదరాబాద్ కమిషనరేట్ - 23,279
రాచకొండ కమిషనరేట్ - 16,871






