ఫోన్ ట్యాపింగ్ కేసు అప్డేట్.. బండి సంజయ్ సిబ్బంది, సన్నిహితుల ఫోన్లు కూడా!

by Ajay Maddhiboyina |

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. కేంద్రమంత్రి బండి సంజయ్ సన్నిహితులు, సిబ్బంది ఫోన్లు సైతం గతంలో ట్యాప్ అయినట్టు అధికారులు గుర్తించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు అప్డేట్.. బండి సంజయ్ సిబ్బంది, సన్నిహితుల ఫోన్లు కూడా!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. కేంద్రమంత్రి బండి సంజయ్ సన్నిహితులు, సిబ్బంది ఫోన్లు సైతం గతంలో ట్యాప్ అయినట్టు అధికారులు గుర్తించారు. కరీంనగర్ బీజేపీ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఫోన్ ట్యాప్ చేసినట్టు నిర్దారించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనకు ఫోన్ చేసి సిట్ విచారణకు రావాలని ఆదేశించారు. ఇప్పటికే పలువురు ప్రముఖుల ట్యాప్ అయినట్టు అధికారులు గుర్తించి విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ అయిన వారిలో రాజకీయ ప్రముఖులతో పాటు సినిమా వాళ్లు కూడా ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సైతం తన ఫోన్ ట్యాప్ చేశారని జగన్‌కు తన సమాచారం చేరవేశారని ఆరోపించారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు.

Next Story