హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్.. ఊరట లభించేనా?

by Gantepaka Srikanth |

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన పోక్సో (POCSO) కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్.. ఊరట లభించేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన పోక్సో (POCSO) కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బండి భగీరథ్‌పై తీవ్రమైన ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఒక మైనర్ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఫిర్యాదుతో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు రాజకీయంగా, సామాజికంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.

హైకోర్టులో పిటిషన్..

పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో భగీరథ్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. బండి భగీరథ్ దాఖలు చేసిన ఈ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. దీనిపై పూర్తిస్థాయి విచారణను ఎల్లుండి (గురువారం) చేపట్టనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. పోలీసుల తరపున వాదనలు విన్న తర్వాత కోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

Next Story