వాళ్లకు రోజులు దగ్గర పడ్డాయి.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

నిష్పాక్షికత, జాతీయత, సేవ, నిబద్ధతలకు ప్రతీక సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అభివర్ణించారు.

వాళ్లకు రోజులు దగ్గర పడ్డాయి.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నిష్పాక్షికత, జాతీయత, సేవ, నిబద్ధతలకు ప్రతీక సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అభివర్ణించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, సీఆర్పీఎఫ్(CRPF) బలగాలు లేకుండా నిర్వహించడం అసాధ్యమన్నారు. ఏ రాష్ట్రానికైనా కేంద్ర బలగాల అవసరం వచ్చినప్పుడల్లా ముందుగా కోరేది సీఆర్పీఎఫ్‌ బలగాలను మాత్రమేనని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే అందులో సీఆర్పీఎఫ్ పాత్ర మరువలేనిదని కొనియాడారు. మావోయిస్టుల నిర్మూలనలో సీఆర్పీఎఫ్ ప్రత్యేక విభాగమైన "కోబ్రా" దళం ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందన్నారు. మావోయిజం పూర్తిగా అంతరించబోయే రోజులు ఎంతో దూరంలో లేవని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర హోంశాఖ అమిత్ షా మార్గదర్శనంలో వచ్చే ఏడాది మార్చినాటికి మావోయిజం అనేదే లేకుండా పూర్తిగా అంతం చేస్తామని ఉద్టాటించారు.

ఈరోజు కర్నాటక రాష్ట్రంలోని బెలగావ్ జిల్లాకు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కు చెందిన కోబ్రా స్కూల్ ఆఫ్ జంగల్ వార్ ఫేర్ అండ్ టాక్టిక్స్ (సీఎస్ జేడబ్ల్యూటీ) కేంద్రంలో నూతనంగా నిర్మించిన ట్రైనింగ్, ఏవీ హాల్ బిల్డింగ్, సబ్ ఆర్డినేట్ ఆఫీసర్స్ మెస్ భవనం, 180 మంది జవాన్లకు బ్యారక్ (సైనిక నివాసాలు)లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బెలగావ్ సౌత్ ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ ఇంఛార్జీ అభయ్ పాటిల్, ఎమ్మెల్యే విఠల్ హళగేకర్, సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ ఏడీజీ రవీదీప్ సాహి, కె.కె. సెక్టార్ ఐజీ డా. విపుల్ కుమార్, డి.ఐ.జీ సుభాష్ చంద్రతోపాటు జిల్లా కలెక్టర్, సీఈవో, డీఎఫ్ఓ, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కు చెందిన కోబ్రా స్కూల్ ఆఫ్ జంగల్ వారియర్ ట్రైనింగ్ (సీఎస్ జేడబ్ల్యూటీ) కేంద్రంలో నూతనంగా నిర్మించిన ట్రైనింగ్, ఏవీ హాల్ బిల్డింగ్, సబ్ ఆర్డినేట్ ఆఫీసర్స్ మెస్ భవనం, 180 మంది జవాన్లకు బ్యారక్ (సైనిక నివాసాలు) లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. రూ.36 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యింది. కోబ్రా స్కూల్ ఫర్ జంగిల్ వార్‌ఫేర్ & టాక్టిక్స్ (CSJWT) కు ఆధునిక సదుపాయాలు అందించి, శిక్షణా వ్యవస్థకు ఒక కొత్త దిశ ఇచ్చేందుకు ఈ భవనాలు ఎంతగానో ఉపయోగపడుతుండటం ఆనందంగా ఉంది. ఈ భవనాల్లో ఆధునిక ఆడిటోరియం, సెమినార్ హాల్, తరగతి గదులు, ఆడియో–విజువల్ గది, శాండ్ మోడల్ గది, (Sand Model Room), IED (ఐఈడీ) మోడల్ రూం, ఇతర శిక్షణా సంబంధిత మౌలిక వసతులు ఈ భవనాల్లో ఉన్నాయి.

మన దేశ అంతర్గత భద్రతకు సీఆర్పీఎఫ్ వెన్నెముక. తీవ్రవాదమైనా, ఉగ్రవాదమైనా, విపత్తునైనా ఎదుర్కొనేందుకు మన జవాన్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వారికి ఎప్పటికప్పుడు ఆధునాతన శిక్షణ, జ్ఞానం, సదుపాయాలు, సంసిద్ధత అత్యంత ముఖ్యమైనవి. ఈరోజు దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే అందులో సీఆర్పీఎఫ్ పాత్ర మరువలేనిది. భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, సీఆర్పీఎఫ్ లేకుండా జరగడం ఒకరకంగా అసాధ్యమనే చెప్పవచ్చు. సీఆర్పీఎఫ్ నిష్పాక్షికత, జాతీయత, సేవ, నిబద్ధతలకు ప్రతీక సీఆర్పీఎఫ్. అందుకే ఏ రాష్ట్రానికైనా కేంద్ర బలగాల అవసరమైనా తొలుత కోరేది సీఆర్పీఎఫ్‌ బలగాలను మాత్రమే.

ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు గణనీయంగా తగ్గాయని, ఈ విషయంలో సీఆర్పీఎఫ్ ప్రత్యేక విభాగమైన "కోబ్రా" దళం పాత్ర ప్రశంసనీయం. కోబ్రా దళంతోపాటు ఇతర బలగాలవల్ల ఒకప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన గ్రామాల్లో నేడు అభివృద్ధి గాలి వీస్తోందన్నారు. మావోయిస్టులు పూర్తిగా అంతరించిపోయే రోజు దూరంలో లేదు. అందులో సీఆర్పీఎఫ్ అత్యంత ప్రధాన పాత్ర పోషించనుంది. ప్రధాని మోడీ నాయకత్వం, హోంమంత్రి అమిత్ షా నేత్రుత్యంలో వచ్చే మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతమొందిస్తాం. దేశం కోసం సేవ, పోరాటాలు, త్యాగాలు చేస్తున్న జవాన్ల సంక్షేమానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. “నేషన్ ఫస్ట్” అనే ప్రతిజ్ఞను గుండెల్లో పెట్టుకొని దేశ సేవ చేయాలని కోరుతున్నా’ అని బండి సంజయ్ కోరారు.

Next Story